తెలంగాణ

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా విద్యుత్ సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యుత్ సంస్థల్లో అమలు చేయడంతో ఆయా సంస్థలు సమర్ధంగా పనిచేస్తున్నాయని కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంస్థ చైర్మన్ మెహర్ పీ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ రఘుపతి సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు విద్యుత్ సంస్థల సీఎండీలకు అవార్డులను అందించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఈ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్‌లో ఈనెల 16 నుంచి 18 వరకు సమ్మిట్ కార్యక్రమాన్ని సీఐఐ నిర్వహించింది. తెలంగాణలో ప్రీ-పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయడంలో విద్యుత్ సంస్థలు విజయవంతం అయ్యాయని సీఐఐ పేర్కొంది. అదేవిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అమలు చేయడం పట్ల సీఐఐ అభినందించింది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల 83 వేల ఎల్‌ఈడీ బల్బులను వినియోగంలోకి తెచ్చామని అన్నారు. సోలార్ విద్యుత్‌తో దాదాపు 2623 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, 87 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రభుత్వ భవనాలపై ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ-పెయిడ్ మీటర్ల తీసుకురావడంతో విద్యుత్ ఆదా అవుతోందన్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో ఎస్‌పీటీసీఎల్ ఆధ్వర్యంలో స్మార్ట్‌గ్రిడ్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిందన్నారు. 42 కోట్లతో 8.818 స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారన్నారు.

*చిత్రం...విద్యుత్ సంస్థల సీఎండీలు దేవులపల్లి ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డిలకు అవార్డులు అందజేస్తున్న సీఐఐ ప్రతినిధులు మెహర్, రఘుపతి