తెలంగాణ

కేటీఆర్‌తో దక్షిణాఫ్రికా హైకమిషనర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని దక్షిణాఫ్రికా హైకమిషనర్ సిబుసిపో ఎనె్డబేలో అన్నారు. రెండు రోజులుగా తెలంగాణలో పారిశ్రామిక వర్గాలతో సమావేశమైన ఎనె్డబే గురువారం నాడు పరిశ్రమల మంత్రి కే తారకరామారావుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇక్కడ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడేందుకు ప్రభుత్వ చొరవతో పాటు తాము వినూత్నంగా తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్ విధానం ప్రధానకారణమని అన్నారు. ఐటీ , ఫార్మా వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. టీఎస్‌ఐపాస్ పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఉందని ఈ సందర్భంగా ఎనె్డబే వ్యాఖ్యానించారు. మహిళాసాధికారత దిశగా పారిశ్రామిక రంగంలో తీసుకుంటున్న చర్యలపై ఆయన మంత్రిని అడిగి తెలుసుకున్నారు.
*చిత్రం...దక్షిణాఫ్రికా హైకమిషనర్ సిబుసిపో ఎనె్డబేలో సత్కరిస్తున్న పరిశ్రమల మంత్రి కేటీఆర్, జయేష్‌రంజన్