తెలంగాణ

మెట్రో రైల్‌కు 60 సంవత్సరాలు రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: హైదరాబాద్ మెట్రోరైలుకు నానున్న 60 సంవత్సరాలు పాటు రాయితీలను ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మెట్రోపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. అందకు కేటీఆర్ సమాధానం చెబుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా ముందుగా 35 సంవత్సరాలు రాయితీలను ఇవ్వాలని కుదుర్చుకున్నప్పటికీ కాలయాపన పెరగడంతో నిర్మాణ సంస్థ సూచనలమేరకు మరో 25 సంవత్సరాలు రాయితీలను ఇవ్వడానకి ప్రస్తుత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెట్రోరైలు ప్రయాణం చేస్తే వాటి అనుభూతి ఏమిటో తెలుస్తుందన్నారు. మెట్రోరైలుపై వాస్తవాలు ఏమిటో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గుర్తు వస్తాయన్నారు. దేశంలో నడుస్తున్న మెట్రోరైలుకు హైదరాబాద్ మెట్రోరైలుకు పోల్చవద్దని భట్టికి మంత్రి సూచించారు. హైదరాబాద్ మెట్రో ప్రారంభం నుంచి రోజురోజుకు ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం రోజూ కనీసం 3లక్షలకు పైగా ప్రయాణీకులు మెట్రోను వినియోగించుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. టికెట్ల ధరల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కంటే హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్ల ధరకంటే మెట్రో టికెట్ల ధర తక్కవగా ఉందన్నారు. మెట్రోపై ప్రభుత్వం కుదరుర్చుకున్న ఒప్పందాల్లో ఎలాంటి మతలబులు లేవన్నారు. సామాన్యుడిపై టికెట్ల ధరలను పెంచి భారం మోపడంలేదన్నారు. మెట్రోపై పెరిగిన భారం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మెట్రోలో 60 సంవత్సరాలపై బడి ఉన్న వ్యక్తులతో పాటు మహిళలకు కూడా ప్రత్యేకంగా బోగీల్లో సీట్ల కేటాయింపులు ఉన్నాయన్నారు.