తెలంగాణ

జ్వరాలు వాస్తవమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో జ్వరాలు వాస్తవమేనని, విష జ్వరాల బారిన పడి ప్రభుత్వాసుపత్రిలో చేరిన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఆయన అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా బదులిస్తూ, సమైక్య పాలనతో పోల్చుకుంటే, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. వివిధ ఆసుపత్రుల్లో పడకలు 22వేలకు పెంచామన్నారు. రాబోయే రోజుల్లో కిడ్నీ, గుండెజబ్బు వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన సేవలు అందిస్తామన్నారు. గతంతో పోల్చితే ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. విపక్ష పార్టీలు విష జ్వరాలపై ప్రజల్లో భయాందోళనలను కల్పిస్తున్నారన్నారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఫీవర్ ఆసుపత్రిల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆరో గ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పేలవం గా ఉన్నాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సదుపాయాలు అధాన్నంగా ఉన్నాయ ని, ఒక్కో బెడ్‌పైన ఇద్దరు, ముగ్గురు రోగులను పడుకోబట్టి వైద్యం అందిస్తున్నారన్నారు. శానిటేషన్ పరిస్థితులు దుర్లభంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు బాగున్నాయని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా అని ఆయన మంత్రి ఈటల రా జేందర్‌ను నిలదీశారు. ఉత్తుత్తి ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. వైద్య పరికరాలు, మందుల కొనుగోలుకు నిధులను తగ్గించి వేశారన్నారు.