తెలంగాణ

లాబాల్లో 28 శాతం వాటా హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణాకు మణిహారం అయిన సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియాపాయింట్‌లో మంత్రి మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది కార్మికులకు లాబాలు పంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడాన్ని కార్మికులు ఎంతో సం తోషిస్తున్నారని అన్నారు. ఒక్కో కార్మికునికి రూ.లక్షా 899 ఇస్తున్న నాయకు డు కేసీఆర్ అన్నారు. ముఖ్యమం త్రి ప్రకటనతో సింగరేణి కార్మికులు ఆనందోత్సవంలో మునిగి పోతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు కల్పించాలని తీర్మానం చేసి ప్రభుత్వం తమదేనన్నారు. చంద్రబాబు హయాంలో డిపెండెంట్ ఉద్యోగాలు తొలగించారని, రాష్ట్ర ఆవిర్భా వం తిరిగి పునఃరుద్దరించేందకు ప్రయత్నించగా కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. దీంతో కారుణ్య నియామకాలను చేపడుతున్నట్టు తెలిపారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తే రాష్ట్ర రాజధానిలో కార్పోరేట్ వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.