తెలంగాణ

నల్గొండలో కాంగ్రెస్ సీనియర్ల ఐక్యతారాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 19: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య రాజకీయాలు సాగిస్తూ ఆది నుండి తలోదారి అన్నట్టు వ్యవహరిస్తున్న సీనియర్లు పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డిలు ఆకస్మాత్తుగా ఏకతారాగం ఆలపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి ఉత్తమ్ పేరును ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని, ఉత్తమ్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫైర్ అవ్వడం విదితమే. అంతేగాకుండా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న ఉత్తమ్, జానారెడ్డి, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిల రాజకీయ అధిపత్యాన్ని సవాల్ చేసినట్టుగా ఉండటంతో వారంతా రేవంత్‌రెడ్డిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. దామోదర్‌రెడ్డి అనుచరుడైన సూర్యాపేట పీసీసీ చీఫ్ చెవిటి వెంకన్న యాదవ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఏకంగా రే వంత్ వ్యవహార శైలి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కోవర్టులా ఉందని స్పందించారు.
ముఖ్యంగా ఎప్పుడూ ఉత్తమ్ అంటేనే విరుచుకుపడే ఎంపీ వెంకట్‌రెడ్డి ఆకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుని హుజూర్‌నగర్‌లో పోటీకి పద్మావతిని ఎంపిక చేసి ఉత్తమ్ సరైన నిర్ణయమే తీసుకున్నారని, రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరో తనకే కాదు జానారెడ్డికి కూడా తెలియదన్నారు. ముప్పై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న మా అందరినీ కాదని తమ జిల్లాలో కొత్త అభ్యర్ధిని ఎలా పెడతారంటూ మండిపడ్డారు. హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్ధిగా పెట్టాలో మాకు తెలియదా ? పద్మావతి ఉత్తమ్‌ను నిలబెట్టి గెలిపిస్తామని, మా జిల్లా రాజకీయాల్లో పక్క జిల్లాల నాయకుల సలహాలు అవసరం లేదంటూ రేవంత్‌పై వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీలో కొత్తగా వచ్చిన రేవంత్‌రెడ్డి సలహాలు తమకు అవసరం లేదన్నారు. గతం లో తనకు, ఉత్తమ్, జానాలకు మధ్య విభేదాలున్నా ఇప్పుడు తామంతా ఒక్కటయ్యామని కాంగ్రెస్‌లో సీనియర్లంతా తననే పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలంటున్నారని, తాను తప్ప మరెవ రు పీసీసీ కొత్త అధ్యక్షుడి రేసులో లేరంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి అనవసరంగా వేలు పెట్టి కాంగ్రెస్ సీనియర్ల ఆగ్రహానికి గురయ్యాడని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు పార్టీ నిర్ణయాల్లో సరైన స్థానం లేదని, పీసీసీ చీఫ్ పదవి కోసం తాను చేస్తున్న ప్ర యత్నాలకు సీనియర్లు అడ్డు పడుతున్నారన్న భా వనతోనే రేవంత్ పార్టీలో తిరుగుబాటుకు సిద్ధమయ్యారని మరికొందరు విశే్లషిస్తున్నారు. ఏదేమైనా రేవంత్ హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయమై చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఐక్యతకు దారితీయగా ఈ పరిణామాలు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణు ల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి.

*చిత్రాలు..రేవంత్‌కు వ్యతిరేకంగా ఏకమైన జానా, ఉత్తమ్, వెంకట్‌రెడ్డి, ఆర్డీఆర్*
*రేవంత్ ప్రతిపాదిస్తున్న అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి