తెలంగాణ

హుజూర్‌నగర్‌లో గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 20: ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులమంతా ఐక్యంగా ముందుకు సాగి త్వరలో జరిగే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా రూరల్ మండలంలోని రాయినీగూడెం వద్ద విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో పద్మావతిరెడ్డియే బలమైన అభ్యర్థి అన్నారు. ఆమె అభ్యర్థిత్వంపై ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఒకవేళ అలాంటివి ఉత్పన్నమైన పక్షంలో అంతర్గతంగా చర్చించుకొని సమష్టిగా విజయం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. దేశరక్షణ కోసం పనిచేసిన చరిత్ర కలిగిన వ్యక్తి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని, ఆయనను విమర్శించే హక్కు మంత్రి జగదీశ్‌రెడ్డికి లేదన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఓడి కాంగ్రెస్ గెలిచిన నాటి నుండి మంత్రి మానసిక పరిస్థితి బాగాలేనట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయని, కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయాయన్నారు. టీఆర్‌ఎస్‌లో యూటీ, బీటీ బ్యాచ్‌లుగా ఏర్పడి అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ జరిగినవి గోరంతైతే కొండంతగా ప్రభుత్వ ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 3 లక్షల కోట్ల అప్పులు చేసి దివాలా తీయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్పులు ఉంటే కొత్త భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. నూతన సచివాలయ నిర్మాణంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. మూడేళ్లగా ఆగిన సిరోంచ-రేణిగుంట జాతీయ రహదారి పనులు నిలిచిపోగా కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చి సాధించినట్టు చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, నాయకులు గుడిపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.