తెలంగాణ

పుట్టంగండి సిస్టర్న్‌ను పరిశీలించిన సీఈలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, సెప్టెంబర్ 20: రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి పుట్టంగండి సిస్టర్న్ రక్షణ గోడ కుంగిపోవడంతో శుక్రవారం ప్రాజెక్టు సీఈతో పాటు క్వాలిటీ కంట్రోల్ సీఈలు పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యత నియంత్రణ పర్యవేక్షణ విభాగం సీఈ అజయ్‌కుమార్, ప్రాజెక్టు సీఈ నర్సింహ్మలు మాట్లాడుతూ పుట్టంగండి సిస్టర్న్‌కు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ప్రస్తుతం ఆయకట్టుకు నీరందించే సమయం కాబట్టి ఎటువంటి మరమ్మతులు ప్రస్తుతం చేయడం లేదన్నారు. త్వరలో ప్రాజెక్టు డిజనైర్లతో సిస్టర్న్ పరిశీలింపచేసి వారి సూచన మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ప్రాజెక్టు ఎస్‌ఈ సాయిబాబా, క్వాలిటీ కంట్రోల్ ఈఈ గోపాల్‌రెడ్డి, ప్రాజెక్టు ఈఈ ఉమాపతిరావు, డీఈఈ శ్రీను, చక్రపాణి, ఏఈఈ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.