తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల్లో చీలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల పక్షాన సమస్యల కోసం పోరాడాల్సిన కార్మిక సంఘాలు రెండుగా చీలిపోయాయి. శుక్రవారం కార్మిక సంఘాలు ఎవరిదారిన వారు జేఏసీలు ప్రకటించుకున్నాయి. ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఇటీవల ప్రధాన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఐక్యంగా ఉద్యమించడానికి అన్ని కార్మిక సంఘాలు ససేమిరా అంటూ ఎవరిదారిన వారు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల పైచిలుకు ఉద్యోగ, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలను పరిష్కరించకుండా కార్మిక సంఘాలు తమ పైచేయిని సాధించుకోవడానికి ఇలా రెండుగా చీలిపోవడం పట్ల కార్మికులు కనె్నర్ర చేస్తున్నారు. ఇటీవల గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ సంఘం సమ్మె నోటీసును యాజమాన్యానికి అందజేసింది. అదే దారిలో ఎంప్లారుూస్ సంఘం, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీసులు ఇచ్చాయి. అయితే జేఏసీలుగా ఏర్పాటు చేసే అంశంలో ఎవరిదారినవారు జేఏసీలు ప్రకటించుకున్నాయి. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌తో మరో నాలుగు సంఘాలు ఐక్యంగా పనిచేస్తామని ప్రకటించాయి. టీజేఎంయూతో బీకేయూ, బీడబ్ల్యూయూ, బీఎంఎస్, ఎస్‌టీఎంయూ, ఎస్‌డబ్ల్యూయూ సంఘాలు కలసి పనిచేయడానికి జేఏసీగా ఏర్పాటు అయ్యాయి. ఈనెల 23న అటు ఆర్టీసీ యాజమాన్యం, ఇటు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపడానికి రాష్ట్ర కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్ లేఖలు పంపారు.కార్మికుల సమస్యలను పక్కన పెట్టి జేఏసీతో జతకట్టకుండా ఎంప్లారుూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు మోసం చేయడమేనని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ హనుమంతు ముదిరాజ్ ధ్వజమెత్తారు. తమ యూనియన్లు గుర్తింపు పొందాయని, అందుకే తాము కార్మికుల సమస్యల కోసం జేఏసీగా ఏర్పాటు చేసుకున్నామని ఎంప్లారుూస్ సంఘం, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు రాజరెడ్డి, అశ్వార్థరెడ్డి మీడియా ముందు వెల్లడించారు.