తెలంగాణ

ఔషధ కాలుష్యంపై ఎన్జీటీ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: మహబూబ్ నగర్‌లోని ఔషధ పరిశ్రమలు సృష్టిస్తున్న కాలుష్యంపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటి) ఆందోళన వ్యక్తం చేసింది. ఔషధ పరిశ్రమల మూలంగా కలిగే కాలుష్యంపై అసమగ్ర నివేదికను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఇవ్వడంపై ఏన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్‌లో ఔషధ కాలుష్యంపై రాసిన లేఖపై స్పందించిన జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గొయల్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలోనే కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు నోటీసులు ఇచ్చింది. ఈ కేసును ఏన్జీటీలో ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ కాలుష్యంపై 2017 ఏడాది తరువాత 2019లో మాత్రమే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు నిర్వహించడాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని ఏన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 24 వ తేదీకి వాయిదా వేసింది.