తెలంగాణ

ఉపరితలంలోకి హైడ్రోజన్ బెలూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 21: వాతావరణంలో విస్తృత సమాచారం కోసం సరికొత్త ప్రయోగాలను చేపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2వ దఫాగా రామగుండంలో ఆ ప్రయోగం మొదలయ్యింది. మొదటగా తెలంగాణలో హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ విస్తృతమైన వాతావరణ సమాచారం కోసం పెద్దపల్లి జిల్లా రామగుండంలో రేడియో సొండొ అండ్ రేడియో విండ్ (ఆర్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ) ప్రయోగాన్ని రామగుండంలో శనివారం రాష్ట్ర వాతావరణ శాఖ ప్రారంభించింది. వాతావరణంలో జరుగుతున్న పెను మార్పులను... వాతావరణంలో జరుగబోతున్నటువంటి మార్పులను కులకుషంగా... కుప్లంగా... తెలుసుకునేందుకు సంబంధిత వాతావరణ శాఖ చేపడుతున్న ప్రయోగంలో భాగంగా రామగుండంలోని వాతావరణ శాఖ కేంద్రం నుంచి ఉపరితలంలో వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులను స్పష్టంగా తెలుసుకునేందుకు హైడ్రోజన్ బెలూన్స్‌ను సుమారు 32 కిలోమీటర్ల పైచిలుకు పంపించారు. ఇదంతా కూడా మెటరాలజిస్ట్ హైదరాబాద్‌కు చెందిన వాతావరణ శాఖ అధికారి గాజుల మల్లయ్య ఆధ్వర్యంలో రామగుండం వాతావరణ కేంద్రంలో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి మొదలు పెట్టారు. ఇది... జరిగిన మూడు రోజులుగా ఇక్కడ ఉపరితలంలో జరుగుతున్నటువంటి మార్పులను తెలుసుకునేందుకు హైడ్రోజన్ బెలూన్స్‌ను ఉపరితలంలోకి పంపించే ప్రక్రియ ఆపరేషన్‌ను చేపట్టారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా అక్కడ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వాతావరణ శాఖ ఈ ప్రయోగాలకు ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు రామగుండంలో సర్ఫేస్ విధానంలో వాతావరణ మార్పులను చూపెడుతూ ఉండేది.
అయితే వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు సరికొత్త విధానంలో తెలుసుకునేందుకు ఈ ప్రక్రియకు ముందుకు వచ్చింది. ఆర్ ఎస్ ఆర్ డబ్ల్యూ, సర్ఫేస్ విధానం, రాడార్ విధానం, శాటిలైట్ విధానం ఇప్పటి వరకు ఉంటుండగా రామగుండంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సారిగా సర్ఫేస్ విధానం కొనసాగుతుంటే ఇప్పుడు కొత్తగా ఆర్ ఎస్ ఆర్ డబ్ల్యూ విధానాన్ని వాతావరణ శాఖ ప్రయోగానికి ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది. ఈ విధానంతో ఇక్కడ వాతావరణంలో జరుగుతున్న మార్పులు, ఇక్కడ ఎలాంటి జీవన విధానాలు కొనసాగుతున్నాయనేది దీంతో స్పష్టంగా తేలిపోనుంది.
*చిత్రం...రామగుండంలో మొదటిసారిగా ఉపరితలంలోకి హైడ్రోజన్ బెలూన్‌ను వదులుతున్న దృశ్యం