తెలంగాణ

రక్తదానాన్ని మించిన దానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 21: రక్తదానాన్ని మించిన దానం ప్రపంచంలో మరొకటి లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్ గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ సౌందర రాజన్ విచ్చేసి శిభిరాన్ని ప్రారంభించారు. ఈ శిభిరంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను గవర్నర్ హోదాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నప్పటికీ అంతకు ముందే తాను నేషనల్ రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యురాలిగా ఉన్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. ముఖ్యంగా రక్తదాన శిభిరాల నిర్వహణ, ఓల్డేజ్ హోమ్, పేదలకు మెరుగైన విద్యను అందించేందుకు పలు పాఠశాలలు నిర్వహించడాన్ని ఆమె అభినందించారు. విద్యార్థులు చదువుల్లో నెంబర్ వన్‌గా ఎలా ఉండాలనుకుంటున్నారో ఇలాంటి సేవా కార్యక్రమాల్లోనూ అలాగే ముందుండాలని సూచించారు. డెంగీ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి శిభిరాల ద్వారా సేకరించిన రక్తం ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతుందని అన్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులకు ప్రతి రక్తపు బొట్టు విలువైందేనని స్పష్టం చేశారు. రక్తదాన శిభిరంలో పాల్గొన్న విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని గవర్నర్ అభినందించారు. ఈ శిభిరం ద్వారా 250 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కళాశాల యాజమాన్యం గవర్నర్‌ను శాలువాతో సన్మానించి మెమొంటోను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సీఈఓ మదన్ మోహన్ రావు, చైర్మన్ దేశాయి ప్రకాష్ రెడ్డి, గవర్నర్ సెక్రటరీ సురెందర్ మోహన్, కళాశాల ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వాణిగొకరాజు, బాచుపల్లి మాజీ సర్పంచ్ ఆగం పాండు పాల్గొన్నారు.

*చిత్రం...నిజాంపేట్ గోకరాజు రంగరాజు కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న
గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్