తెలంగాణ

మాజీ ఎమ్మెల్యేలకు పెంచిన పింఛన్ అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్సీలకు పెంచిన పింఛన్ ఇవ్వాలని మాజీ లెజిస్లేటర్లు కోరారు. మాజీ లెజిస్లేటర్ల సంఘం అధ్యక్షులు లింగయ్య నేతృత్వంలో పలువురు మాజీ సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ టీ. పద్మారావు, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంతరెడ్డిని శాసనసభలో శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మల్సీలకు 30 వేల రూపాయలు పింఛన్‌గా ఇస్తున్నారని, దీన్ని 50 వేల రూపాయలకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించి చాలా కాలం అయినా అమల్లోకి రాలేదన్నారు. వెంటనే 50 వేల రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వాలని కోరారు. అలాగే వైద్యం ఖర్చులు కూడా పెంచాలని, మాజీ శాసనసభ్యులు ఎవరైనా మరణిస్తే వారి భార్యలకు వైద్య సౌకర్యం కల్పించాని కోరారు. మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్‌లో నివాసం కల్పించాలని, ఢిల్లీలోని వసతి గృహాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ బృందంలో రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జీ. రాజేశంగౌడ్, శాసనమండలి మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాజీ సభ్యులు సుద్దాల దేవయ్య, కోడూరి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.
*చిత్రం...డిప్యూటీ స్పీకర్‌కు వినతిపత్రం అందజేస్తున్న మాజీ లెజిస్లేటర్లు