తెలంగాణ

పర్యాటకంలో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: తెలంగాణకు విదేశీ పర్యాటకుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ కేంద్ర పర్యాటక శాఖ తెలంగాణకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులను అందజేసింది. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ చేతుల మీదుగా శ్రీనివాస్‌గౌడ్ అవార్డులు అందుకున్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉపయోగంతో పర్యాటకులకు సమాచారం అందించినందుకు అవార్డు లభించింది. అలాగే వైద్య పర్యాటక సౌకర్యం విభాగంలో అత్యుత్తమ సేవాలు అందించినందుకు హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సీటీకి ఉత్తమ అవార్డు లభించింది. అవార్డులు అందుకున్న తరువాత మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విలేఖరులతో
మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో పర్యాటక రంగంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందన్నారు. 2014లో 65 వేల మంది విదేశీ పర్యాటకుల తెలంగాణ రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. పర్యాటక విభాగంలో ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. దీని వెనక ప్రభుత్వం, అధికారులు కృషి ఎంతో వుందని వెల్లడించారు. ఎంతో చరిత్ర గల తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో మరింత మందుకు తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ హస్పటల్ టూరిజం దేశంలో అగ్రభాగాన ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంపన్న దేశ ప్రజల కూడా హైదరాబాద్ వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు.