తెలంగాణ

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ భవన్‌లో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆట, పాటలతో అలరించారు. అంతకుముందు లుంబినీ పార్క్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కూడా మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. నాంపల్లిలోని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం (టీజీఏ) కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు కూడా సత్యవతి రాథోడ్ హాజరు కాగా సంఘం గౌరవాధ్యక్షుడు, మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. టీజీఏ అధ్యక్షురాలు మమత, టీఎన్‌జివో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, మహిళా నాయకురాలు రేచల్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, గుండు సుధారాణి, తుల ఉమ, పద్మాదేవేందర్‌రెడ్డి