తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు మద్దతుపై పునరాలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై వివిధ వర్గాల నుండి వస్తున్న ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకొని, పునరాలోచన చేయనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. తొలుత హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఐ భావించినా, ఇటీవల మొదలైన ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మొండి వైఖరి చూసిన తర్వాత ఉప ఎన్నికలో ఈ విషయంపై పునరాలోచన చేయనున్నామని చాడ బుధవారం నాడు పేర్కొన్నారు. దీనిపై గురువారం నాడు పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి ఇప్పటికైనా చర్చలు జరపాలని, కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా, సమస్య పరిష్కారానికి తోడ్పడే చర్చలను చేపట్టాలని చాడ సూచించారు. గతంలో సీఎం చేసిన వాగ్దానాలనే అమలుచేయమని
ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారని , గత నెల రోజులుగా తమ డిమాండ్లను పలురూపాల్లో తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ముందస్తు నోటీసులతోనే సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సాచివేత వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. కార్మికుల సమ్మెను చట్టవిరుద్ధమని సీఎం అనడం విడ్డూరమని అన్నారు. ఉద్యోగులను తొలగిస్తామని సీఎం అనడం భావ్యం కాదని, దొరల పాలన తగదని హితవు పలికారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే సహించేది లేదని, సంస్థ కార్మికులు ఒంటరిగా లేరని, తెలంగాణ మొత్తం వారి వెనుక ఉందని గుర్తించాలని పేర్కొన్నారు.