తెలంగాణ

పూర్తిగా ఖాళీ కానున్న మూసీ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, అక్టోబర్ 9: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కనిష్ట స్ధాయికి పడిపోతోంది. ప్రాజెక్టు 5వ నెంబరు రెగ్యూలేటరీ గేటు విరిగిపోవడంతో గత ఐదురోజులుగా ప్రాజెక్టు నుండి నీరు వృధాగా సముద్రం పాలవుతుంది. ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటి మట్టం 645 అడుగులుకాగా గేటు విరిగిన సమయంలో 644.90గా ఉండి 4.44 టీఎంసీల నీరు ఉండగా బుధవారం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 622 అడుగులకు పడిపోయి 0.65 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉంది. గేటు విరిగి పోవడం వల్ల గడిచిన ఐదురోజుల్లో 3.75 టీఎంసీల నీరు దిగువకు వృథాగా పోయింది. గేటు విరిగిన సమయం నుండి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ప్రాజెక్టు అధికారులు నిరంతరం సమీక్షాలు జరుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు గేటు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మంత్రి ఆదేశాలతో చిత్తూరు జిల్లాలోని కల్యాణి డ్యాం వద్ద మిగిలి ఉన్న స్ట్ఫాలాగ్ గేట్లను యుద్దప్రాతిపదికన మంగళవారం ఉదయానికి మూసీ ప్రాజెక్టు వద్దకు తరలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. రెగ్యూలేటరీ పూర్తి గేటు నిర్మాణానికి ఐదు విడిభాగాలు కావాల్సి ఉండగా రెండు విడి భాగాలు చిత్తూరు నుండి రాగా ఇంకా కావాల్సిన మూడు విడి భాగాలను హైదరాబాద్ పటాన్ చెర్వులోకి పారిశ్రామికవాడలో తయారు చేయిస్తున్నారు. అయితే నేటి సాయంత్రానికి కూడ అందుకు సంబందించిన పనులు పూర్తి కాలేదు. ఆ మూడు గేటు విడి భాగాలు నేటి అర్ధరాత్రికి వచ్చే అవకాశం ఉన్నందున గేటు నిర్మాణానికి చేపట్టాల్సిన పనులను జిల్లా నీటి పారుదల ఎస్‌ఈ హమీద్‌ఖాన్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి అధికారులతో సమీక్షిస్తుండటంతో పాటు చేపట్టాల్సిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రెగ్యూలేటరీ గేటు 610 అడుగుల నుండి 625 అడుగుల మేర వరకు 15 పీట్ల పొడువు, 40 ఫీట్ల వెడల్పుతో ఉండటంతో ప్రాజెక్టు నీటిమట్టం 610 అడుగులకు పడిపోతేనే తప్ప నూతన గేటు నిర్మాణం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అధికారులు సైతం ఇదే విషయాన్ని నర్మగర్భంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా 5వ నెంబరు గేటు విరిగిపోయేందుకు గేటుకు ఇరువైపులా నిర్మించిన కాంక్రిట్ గోడలే ప్రధాన కారణంగా ప్రాథమిక విచారణలో అధికారులు తేల్చారు. ఏది ఏమైనప్పటికీ నిండు కుండలా ఉన్న మూసీ ప్రాజెక్టు నేటితో ఖాళీ అవుతుండటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. చిత్తూరు జిల్లా నుండి వచ్చిన గేట్లును మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో గేటు మార్పిడిని చేపట్టి నీటి వృధాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా విరిగిన గేటు ద్వారా 8,650 క్యూసెక్కులు, కుడి, ఎడమకాల్వల ద్వారా 350 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఎఈ మమత తెలిపారు.

*చిత్రం...గేటు విరిగి ప్రాజెక్టు నుండి దిగువకు వృథాగా పోతున్న నీరు, కనిష్టానికి పడిపోతున్న నీటిమట్టం (ఇన్‌సెట్లో)