తెలంగాణ

అభివృద్ధి చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, అక్టోబర్ 9 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసున్న అభివృద్ది, సంక్షేమ పధకాలు చూచి ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని టీఆర్‌ఎస్ ఉప ఎన్నిక ఇన్‌చార్జి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, పాలకీడు సర్పంచ్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారని అన్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ అహాన్ని, ఒంటెద్దుపోకడలను తట్టుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు విసిగిపోయారని గులాబీ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ పద్మావతి గెలిస్తే వారి కుటుంబానికి మాత్రమే లాభమని, టీఆర్‌ఎస్ గెలిస్తే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి జరిగి లాభపడుతారని అన్నారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీపీకి గులాబీ కండవా కప్పుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి