తెలంగాణ

ఓటర్లను ఉత్తమ్ ప్రలోభ పెడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి భర్త, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు టీఆర్‌ఎస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సంబంధించిన మూడు వేర్వేరు ఫిర్యాదులతో పాటు సాక్ష్యాధారాలను ఎన్నికల కమిషన్‌కు అందజేసినట్టు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ఎన్నికల సమన్వయం కమిటీ సభ్యుడు దండె విఠల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.