తెలంగాణ

సమాజ సేవ చేస్తున్న క్రిస్టియన్లకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: సమాజ సేవలో నిమగ్నమైన క్రిస్టియన్లను, క్రిస్టియన్ సంస్థలను సన్మానించాలని రాష్ట్ర క్రిస్టియన్ (మైనారిటీలు) ఫైనాన్స్ కార్పోరేషన్ నిర్ణయించింది. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక సేవ, వైద్యం, విద్య, సాంస్కృతిక రంగం, ఫైన్ ఆర్ట్స్/్థయేటర్, క్రీడలు తదితర రంగాల్లో గత 10 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా సేవ చేస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అలాగే వైద్యం ఆరోగ్యం, విద్య, సామాజిక సేవ తదితర రంగాల్లో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. 2019 అక్టోబర్ 10 నుండి నవంబర్ 15 వరకు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పంపించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుండి నమూనా దరఖాస్తులను తీసుకోవచ్చని వివరించారు. అలాగే ఈ సంస్థ వెబ్‌సైట్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎస్‌సీఎంఎఫ్‌సీ.ఇన్) నుండి కూడా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ వివరించారు.
మరింత సమాచారం కోసం 040-2339 1067 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.