తెలంగాణ

నేడు అలయ్.. బలయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఏటా దసరా సందర్భంగా బీజేపీ నేత, ప్రస్తుత హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అలయ్ బలయ్. ఈసారి ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గురువారం నక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిభూషణ్ చందన్, హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులను అదే వేదికపై సత్కరించనున్నారు. అలయ్ బలయ్‌లో భాగంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దులు, సదర్, బతుకమ్మ, బోనాలు కార్యక్రమాలు కూడా ఉంటాయి. అనంతరం ఆహ్వానితులకు విందు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దత్తాత్రేయ బుధవారం రాజభవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
*చిత్రం... రాష్ట్ర గవర్నర్ తమిళిసైని బుధవారం రాజ్‌భవన్‌లో కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసి సత్కరిస్తున్న హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ