తెలంగాణ

ప్లాస్టిక్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకు ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. త్వరలోనే ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామాలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుపై ప్రగతిభవన్‌లో గురువారం కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు, సంబంధితశాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక కార్యాచరణ అమల్లో తమతమ అనుభవాలను కలక్టర్లు వివరించారు. గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) దిగ్విజయంగా అమలు జరిగిందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన మంత్రులు, కలక్టర్లు, డీపీఓలు, డీఎల్‌పీవోలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లను సీఎం అభినందించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యుత్ శాఖ నంబర్ వన్‌గా నిలిచిందని ప్రశంసించారు. ప్రత్యేక కార్యాచరణ ముగిసినప్పటికీ విద్యుత్ సిబ్బంది ఇంకా గ్రామాలలో పనులు చేస్తూనే ఉన్నారని అన్నారు. తాను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. వీటిని తీర్చడానికి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ ప్రయత్నం జరుగలేదని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తిని అన్ని శాఖలు, అధికారు లు, ఉద్యోగులు, ప్రజలు కొనసాగించాలని
సీఎం పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్థికి నెలకు రూ.339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయానికి ఇది అదనం అవుతుందని అన్నారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల నిర్వహణలో అత్యవసరమైన చోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతి కలక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్టు సీఎం చెప్పారు. ఈ నిధులు కలక్టర్లు తమ విచక్షణతో వినియోగించాలని సీఎం సూచించారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనుల్లో చురుకైన పాత్ర పోషించి, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలక్టర్ దేవసేన, సంగారెడ్డి కలక్టర్ హనుమంతరావు, భూపాలపల్లి కలక్టర్ వెంకటేశ్వర్లును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పల్లె ప్రగతి కార్యక్రమానికి మంచి ఫలితాలు వచ్చాయని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే చైతన్యం ప్రజల్లో వచ్చిందని సీఎం అన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలని భవిష్యత్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సీఎం ప్రకటించారు. గ్రామాలు బాగుపాడలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్టు సీఎం వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు ఎట్టి పరిస్థితుల్లో నిధుల కొరత రానివ్వమని పేర్కొన్నారు. ప్రతి నెలా ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ‘అవసరమైన నిధులు ఇచ్చాం, సిబ్బందిని ఇచ్చాం ఇకనైనా గ్రామాల్లో మార్పు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం అన్నారు. గ్రామ స్థాయిలో రూపొందించిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా పనులు జరగాలని సీఎం ఆదేశించారు.

*చిత్రం... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు