తెలంగాణ

కోడ్ ముగిసాక వరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల కోడ్ ముగిసాక, ఈనెల 21 తర్వాత దశల వారీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ఎక్సైజు శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి మమత, టీఎన్‌జివో సంఘం ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన
కార్యదర్శి సత్యనారాయణ తదితరుల బృందం గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది. కలక్టర్ల సమావేశం జరుగుతుండగా ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో వారంతా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా 30 రోజుల ప్రత్యేక గ్రామ ప్రణాళిన విజయవంతానికి ఉద్యోగులు బాగా కృషి చేశారని సీఎం అభినందించారు. ఉప ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని సమావేశం కానున్నట్టు కూడా సీఎం హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు తెలిపారు. ఇలా ఉండగా ఉద్యోగులకు 3.44 శాతం కరువు భత్యం ప్రకటించడంతో పాటు పీఆర్‌సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిపై కోడ్ ముగిసిన తర్వాత ప్రకటించనున్నట్టు సీఏం కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే కోడ్ ఉండటం వల్ల ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదని సమాచారం.

*చిత్రం...ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఉద్యోగుల జేఏసీ నేతలు