తెలంగాణ

పంచాయతీ ఉద్యోగులకు జీవిత బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికి రూ.2 లక్షల జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పని చేసే ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సొమ్ము అందేలా పథకాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రగతిభవన్‌లో గురువారం జరిగిన కలక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని సీఎం వెల్లడించారు. ఈ బీమా పథకానికి పంచాయతీరాజ్ ఉద్యమానికి అధ్యుడైన ఎస్‌కె డే నామకరణం చేసినట్టు చెప్పారు. రైతు ల కోసం అమలు చేస్తున్న రైతుబీమా మాదిరిగానే ఎస్‌కె డే బీమా పథకం ఉంటుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతి ఏటా మూడు సార్లు నిర్వహించాలని నిర్ణయించినట్టు సీఎం చెప్పారు. పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లపై నిర్ణయం తీసుకోనున్నట్టు సీఎం ప్రకటించారు. పచ్చదనం, పరిశుభ్రత ప్రోత్సహించడంలో భాగంగా ఇంటిని, పరిసరాలను పచ్చగా, శుభ్రంగా ఉంచుకునే వారి ఇళ్లకు ఉత్తమ గృహం అవార్డులు ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రతీ గ్రామానికి సరిహద్దులతో గ్రామ కంఠాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని రహదారులను గ్రామ పంచాయతీ పేర రిజిస్టర్ చేయాలని సీఎం ఆదేశించారు.