తెలంగాణ

సమ్మెకు మద్దతు కోరతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు కోరుతామని ఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సంస్థ ఉద్యోగులను తొలిగించినట్లు తమకు నోటీసులు రాలేదని, అవి చేతికి అందితే తగిన రీతిలో స్పందిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్య మొండి వైఖరే సమ్మెకు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు కోసం అన్ని వర్గాల మద్దతు కోరతామని తెలిపారు. సమ్మెకు మద్దతుగా తెలంగాణ బంద్‌తో పాటు బహిరంగ సభ తేదీలను ప్రకటించేందుకు శుక్రవారం మరోసారి భేటీ కావాలని జేఏసీ నిర్ణయించిందని ఆయన అన్నారు. సమ్మెను బలీమైన శక్తిగా ముందుకు నడిపించడానికి సుందరయ్య విజ్ఞాన్ భవన్‌లో
ఆర్టీసీ జేఏసీతో అఖిలపక్ష నేతలు గురువారం భేటీ అయ్యారు. తెలంగాణ జన సమితి నేత కోదండరామ్, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పలువురు జేఏసీ నేతలు హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. సమ్మె ప్రభావం ప్రభుత్వానికి తెలిజేసే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కూడగట్టడానికి సమాలోచనలు చేశారు. గత ఆరు రోజులుగా ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ప్రజారవాణా దెబ్బతినిందని, అలాగే ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయిందని సమావేశంలో పాల్గొన్న నేతలు అన్నారు. సమావేశం అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపాటు కోదండరామ్, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా తన మంకుపట్టును వదలి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అందరూ ధైర్యంగా ఉంటూ, ఇదే స్ఫూర్తితో సమ్మెను కొనసాగించాలని ఆయన ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమ్మెలను అణచివేయాలని ప్రయత్నిస్తే, అధికార ప్రభుత్వాలు సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని వారు వ్యాఖ్యానించారు. గతంలో అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి, సమ్మె నివారించడానికి కేసీఆర్ ప్రయత్నించాలని వారు హితవు పలికారు. సమ్మెను యథాతంగా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. గత ఆరురోజులుగా చేస్తున్న సమ్మె విజయవంతమైందని అన్నారు. సమ్మెకు ప్రజల మద్దతు లభించినట్టు చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదుకాబట్టే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. రవాణా వ్యవస్థను కాపాడడానికి తాము ప్రయత్నిస్తున్నామని వారు స్పష్టం చేశారు. హైకోర్టులో కూడా తమ వాదనలను బలంగా వినిపించామన్నారు. కాగా ఆర్టీసీ జేఏసీ -1 కార్మిక యూనియన్లు కన్వీనర్ ముదిరాజ్ హనుమంత్ ఆధ్వర్యంలో జేఏసీ కో కన్వీనర్ రమేష్‌కుమార్, ఎస్. సురేష్ హరికృష్ణ ఆధ్వర్యంలో గురువారం గవర్నర్ తమిళిసైని కలసి తాము సమ్మె దారితీసిన పరిస్థితులను వివరించారు. సమ్మె నోటీసు ఇచ్చిన నెల రోజుల అనంతరం కార్యాచరణలోకి దిగామన్నారు. ఆర్టీసీ జేఏసీ ఎలాంటి సాంకేతిక సమస్యలను ఉత్పన్నం చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, దసరా పండుగ నేపథ్యంలో సమ్మె విరమించుకోవాలని సూచించిందన్నారు. ఈ పిలుపులో అర్థం లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆరోపించారు.
*చిత్రం... మహాత్మాగాంధీ బస్‌డిపోలో గురువారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ధర్నా
* ఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి (ఇన్‌సెట్‌లో )