తెలంగాణ

కనీస నీటిమట్టానికి మూసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, అక్టోబర్ 10: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా రోజురోజుకు పడిపోతూ 618 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను ఈనెల 5న 644.90 వద్ద ప్రాజెక్టు 5వ నెంబరు రెగ్యూలేటరీ గేటు విరిగిపోవడంతో దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న 4.4 టీఎంసీలుగా ఉన్న నీరు గేటు ద్వారా దిగువకు వెళ్తుండటంతో బుధవారం సాయంత్రానికి 0.4 టీఎంసీల కనిష్ట మట్టానికి పడిపోయింది. ఇప్పటి వరకు టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైంది. ప్రాజెక్టు ఏగువ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన విస్తారమైన వర్షాల వల్ల ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటం ఆనందం కలిగించే విషయమైనప్పటికీ ప్రాజెక్టు నుండి ఏడు వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండగా 3500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. కాగా గేటు పునరుద్దరణకు అవసరమైన ఐదు విడి భాగాల్లో చిత్తూరు నుండి రెండు భాగాలు మంగళవారమే చేరుకున్నప్పటికీ హైదరాబాద్‌లో తయారుచేయిస్తున్న మరో మూడు విడి భాగాల పనులు ఇంకా పూర్తికాక పోవడంతో పునరుద్దరణ పనుల్లో ఎలాంటి ముందడుగు పడటం లేదు. యుద్దప్రాతిపదిన పనులు చేపడుతున్నట్లు అధికారులు చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి.
బుధవారం అర్ధరాత్రికి పటాన్‌చెర్వులో తయారుచేయిస్తున్న గేటు విడిభాగాలు ప్రాజెక్టు వద్దకు బయలుదేరే అవకాశం ఉందని, అది ఇక్కడకు చేరిన వెంటనే గేటు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎఈ మమత తెలిపారు. కాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ సందర్శించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు గేటు విరిగి 4 టీఎంసీల నీరు వృధా అయి ఆయకట్టు రైతులకు నష్టం జరిగిందన్నారు. నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*చిత్రం... కనిష్ట మట్టానికి పడిపోయిన మూసీ ప్రాజెక్టు