తెలంగాణ

ఐదుగురు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ/హాలియా/మోత్కూర్, జనవరి 3: నల్లగొండ జిల్లాలో ఆదివారం నలుగురు రైతులు, వరంగల్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడగా, నల్లగొండ జిల్లాలో వ్యవసాయబావి వద్ద మోటార్‌ను పెట్టేందుకు వెళ్ళి విద్యు దాఘాతానికి గురై ఒక మహిళా రైతు మరణించింది. నల్లగొండ జిల్లాలో పత్తి సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తి చెందిన అంబోతు మధు (30) అనే యువరైతు ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిఐ గట్టు మల్లు తెలిపిన వివరాల మేరకు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంబోతుతీస్య తండాకు మధుకు మొత్తం ఐదు ఎకరాల భూమి ఉండగా మూడు ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వేరుశనగ సాగుచేశాడు.
వర్షాభావంతో సరైన దిగుబడులు లేకపోవడంతో పాటు ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు తాజాగా మరిన్ని అప్పులు చేసి బోరు వేసినా నీరు పడలేదు. దీంతో పైరును కాపాడుకునే మార్గం లేక పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేనన్న బెంగతో ఆదివారం తెల్లవారుజామున ట్రాన్స్‌ఫార్మర్ వద్ధకు వెళ్లి వైర్లను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన భార్య కమల, తండ్రి నంద్యాలు మధును కాపాడేందుకు ప్రయత్నించగా వారు కూడా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ముగ్గురిని చికిత్స నిమిత్తం హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధు ఆదివారం సాయంత్రం మరణించారు. భార్య కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. అదేవిధంగా ఇదే మండలం తూర్పుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సపావట్‌తండాలో పత్తి సాగు కోసం చేసిన అప్పులు ఒక వైపు, పెళ్ళికెదిగిన కూతురికి పెళ్ళి ఎలా చేయాలో తెలియక జీవితంపై విరక్తి చెందిన సపావట్ శకృ (50) అనే రైతు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా అనుముల మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు పశ్యా (30) అనే పత్తిరైతు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సురేశ్‌కుమార్ తెలిపారు. వ్యవసాయబావి వద్ద మోటార్‌ను పెట్టేందుకు వెళ్ళి విద్యుదాఘాతానికి గురై నేనావత్ కౌసల్య (35) అనే మహిళా రైతు దుర్మరణం చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి దేవరకొండ మండలం పెండ్లిపాకల గ్రామపంచాయతీ పరిధిలోని హర్యాతండాలో జరిగింది.
మోత్కూర్ మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన రైతు బద్దం స్లీవరాజు (40) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో వేసిన పంటలు ఆశించిన దిగుబడి ఇవ్వకపోవడం.. పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొనడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి పంటచేను వద్దే తనువు చాలించాడు.

నల్లగొండ జిల్లా ఆంబోతుతీస్య తండాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఆంబోతు మధు

మేడారం జాతరను
విజయవంతం చేయాలి
ౄ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడండి
ౄ భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
ౄ పోలీసు అధికారులకు డిజిపి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగనున్న వరంగల్ జిల్లా మేడారం జాతరను విజయవంతం చేయాలని డిజిపి అనురాగ్‌శర్మ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మేడారం జాతర భద్రత ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతర ఏర్పాట్లను చేపట్టిందని, గతంలో జరిగిన గోదావరి పుష్కరాల స్ఫూర్తితో మహాజాతరను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. జాతర సందర్భంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. భద్రత ఏర్పాట్లు కట్టుదట్టం చేయాలని ఆయన అన్నారు. పోలీసులు సమర్ధవంతంగా విధులను నిర్వహిస్తే పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, ఆ దిశగా జాతరలో పోలీసులు సేవలు అందించాలన్నారు. ముందుగా ఆయన మేడారం వెళ్లు తాడ్వాయా - పస్రా డబుల్‌రోడ్డు పనులను పరిశీలించి ట్రాఫిక్‌జామ్ ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచను ఇచ్చారు. జంపన్నవాగు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్, స్నానఘట్టాల వద్ద తీసుకోవాల్సిన చర్యలు గురించి తగిన విధంగా సూచనలు ఇచ్చారు. జాతర భద్రత ఏర్పాట్లపై డిఐజి మల్లారెడ్డి, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాతో చర్చించరు. అనంతరం మేడారం అమ్మవారి సన్నిధికి చేరుకున్న డిజిపి అనురాగ్‌శర్మకు సంప్రదాయ డోలువాయిద్యాలతో గిరిజన పూజారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిజిపి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఐజి శివధర్‌రెడ్డి, డిఐజి మల్లారెడ్డి, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు.