తెలంగాణ

కార్మికులూ.. అధైర్యపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 13: కార్మికులు ఆధ్యైర్యపడొద్దని, సమస్యలను పోరాడి సాధించుకుందామని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ ముఖ్య కన్వీనర్ అశ్వత్దామరెడ్డి అన్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో మరణించిన ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్-విజయవాడ 65వ నెంబ ర్ జాతీయ రహదారిపై స్వగ్రామానికి తరలిస్తున్న సందర్భంగా హైవేపై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. మృతదేహంతో వెళ్తున్న వాహనాన్ని అపి నివాళులర్పించేందుకు ప్రయత్నిస్తున్న ఆర్టీసీ కార్మికులను అడ్డుకుని నేరుగా పంపించారు. అంబులెన్స్ వెంట వస్తున్న జేఏసీ నాయకుల నుంచి అశ్వద్దామ కొద్దిసేపు కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్మికులు
ఎవరూ అధైర్య పడొద్దన్నారు. శాంతియుతంగా పోరాటం సాగించి ప్రజల సంపూర్ణ మద్దతుతో సమస్యలను పరిష్కారం చేసుకుందామన్నారు. ఆర్టీసీ కార్మికులు కోరుతున్నవి గొంతమ్మ కోర్కెలు కావన్నారు. పక్క రాష్ట్రం అమలు చేస్తున్నవేనని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తూ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ప్రభుత్వం మెడలు వంచి సమస్యలను పరిష్కారం చేసుకుందామని చెప్పారు. పెట్టుబడిదారులకు ఆర్టీసీని దారాదత్తం చేసేందుకు కేసీఆర్ కుట్రలు సాగిస్తున్నారని, అందరం ఏకమై ఆర్టీసీని కాపాడుకుందామన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రాజిరెడ్డి, వి.ఎస్.రావు, థామస్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
*చిత్రం...కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి