తెలంగాణ

ఆర్టీసీ సమ్మె జటిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అనుసరించిన సామ, భేద, దాన, దండోపాయాలు ఫలించకపోవడంతో ఇది రోజు రోజుకు మరింత జఠిలంగా మారుతోంది. దసరా పండుగకు ముందు ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె తొమ్మిదవ రోజుకు చేరుకోవడంతో ప్రజా రవాణా వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కార్మికులు సమ్మెలో ఉన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా గ్రహించడంతో విద్యాసంస్థలకు ఈ నెల 19 వరకు సెలవులను పొడిగించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మె ఒక అగ్ని పరీక్షలా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఇంతకాలం ప్రతిపక్షాలకు ఎలాంటి అస్త్రం లభించలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండివైఖరే ప్రతిపక్షాల చేతికి అస్త్రాన్ని అందించినట్టు అయింది. ఆర్టీసీ సమ్మెలాంటి సమస్య పాలక ప్రభుత్వానికి మనుపెన్నడూ ఎదురుకాలేదు. సమ్మెకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతోపాటు కొన్ని ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించి అండగా నిలవడంతో సమ్మె రోజురోజుకూ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ సమ్మెను పరిష్కరించే దిశగా కాకుండా ఉక్కుపాదంతో అణచివేసే దిశగా అడుగులు వేస్తోంది. సమ్మె పట్ల ప్రభుత్వ అణచివేత ధోరణికి మనస్తాపంతో ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందడంతో ఆర్టీసీ కార్మికులకు ప్రజల నుంచి కూడా సానూభూతి వ్యక్తమవుతోంది. సమ్మె పట్ల ప్రజల మద్దతు కూడగట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సమ్మె పట్ల ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరిస్తోందో తెలియజెప్పలేకపోయింది. సమ్మె పట్ల ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి
తప్ప మిగతా వారెవరూ ఇంతకాలం స్పందించలేదు. సమ్మెపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో ఎట్టకేలకు మంత్రివర్గంలో తొలిసారి పదవులు పొందిన కొత్త మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఆదివారం స్పందించారు. అయితే స్పందించిన వారిలో సీనియర్ మంత్రులు కానీ, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేతలు కానీ ఎవరూ లేకపోవడం వల్ల ఫలితం లేకుండా పోయింది. పైగా తెలంగాణ ఉద్యమ సమయంలో తమతో కలిసి పనిచేయని, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే ఇప్పుడు మంత్రుల హోదాలో తమను రెచ్చగొడుతున్నారని కార్మిక సంఘాల నేతలు తిప్పికొట్టడంలో సఫలీకృతమయ్యారు.
మరోవైపు రెవెన్యూ శాఖను రద్దు చేయబోతోందన్న భయంతో ఇంతకాలం ఆందోళనతో ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రెవెన్యూ ఉద్యోగుల మద్దతుగా సమ్మెకు దిగితే ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. రెవెన్యూ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పడితే టీఎన్‌జీవోలు, టీజీవోలు కూడా మద్దతు ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడనుంది.