తెలంగాణ

అది రాజకీయ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను రాజకీయ కుట్రగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు రాజకీయ కుట్రలో పావులుగా మారారని ఆయన విమర్శించారు. ఆదివారం టీఆర్‌ఎస్ శాసనసభాప కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రతిపక్షాల వలలో పడ్డారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల కుట్రలను కార్మికులు అర్థం చేసుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోకానీ, మరెక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా ఉహించని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,303 కోట్లు కేటాయించిందన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించబోతోందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రైవేటీకరిస్తామని సీఎం ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ
హయాంలో ఆర్టీసీకి ఏమి చేశారని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల బీజేపీ నేతలు చేస్తున్న డ్రామాలు కట్టిపెట్టాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చిందా? ఆ పార్టీ నాయకులు కేంద్రంపై ఏదైనా మేలు చేసిందా? అని మంత్రి నిలదీశారు. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని రాష్ట్రంలో బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే కేంద్ర ప్రభుత్వమే ఈ పథకానికి అవార్డులు ఇస్తోందని ఎర్రబెల్లి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీని నాశనం చేయడానికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కంకణం కట్టుకున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు నచ్చజెప్పాల్సిందిపోయి వారిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆర్టీసీని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు కేసీఆర్ నాయకత్వానే్న బలపరిచారన్నారు. ఆర్టీసీ కార్మికుని ఆత్మహత్యకు రెచ్చగొట్టిన రాజకీయ పక్షాలే బాధ్యత వహించాలన్నారు.

*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి