తెలంగాణ

సమ్మెపై బలప్రయోగమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని, ఈ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ ద్రోహులు మంత్రులేనన్నారు. ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా మాట్లాడడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా ఉద్యమం చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, లక్ష్యాన్ని సాధించే వరకు శాంతియుతంగా ఉండాలన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు సకల జనుల సమ్మెకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలను సాధించవచ్చన్నారు. సమైక్య పాలనలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఉద్యమకారులను ఎలా అణచివేశారో, ఇపుడు కూడా ఆ మాదిరిగానే అణచివేస్తున్నారన్నారు. ఎస్మాలు ప్రయోగిస్తామని హెచ్చరిస్తే, కేసీఆర్ ఏకంగా ఉద్యోగులను డిస్మిస్ చేశారన్నారు. పోలీసులతో ఉద్యమాలను అణచాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ ఉద్యోగ సంఘాల మధ్య చీలికలను తీసుకువస్తున్నారన్నారు. స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుదామని చెప్పిన కేసీఆర్ ఏమి చేస్తున్నారన్నారు. మహిళా కండక్టర్ల పైటను మగ పోలీసులు లాగే పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఆర్టీసీ ఆస్తులు,
అప్పులపైన శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ రాజకీయ పార్టీల మద్దతు తీసుకోవద్దని చెప్పడం దారుణమన్నారు. టీఎన్‌జీవో నేతలు గతంలో ఉద్యమంలో పొలిటికల్ జేఏసీతో కలిసి పనిచేయలేదా? అని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే సీఎంతో విందు ఆరగిస్తారా అని ఆయన నిలదీశారు.
చర్చలకు పిలవండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను వెంటనే చర్చలకు పిలవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మాహుతి చేసుకునే తీవ్ర చర్యలకు పాల్పడరాదన్నారు. ఈ సమస్యను చర్చల ద్వారా సానుకూల దృక్పథంతో పరిష్కరించాలన్నారు.
సమ్మెకు బీజేపీ రిటైర్డు టీచర్ల సంఘం ఎంప్లారుూస్ సెల్ మద్దతు
ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ రిటైర్డు టీచర్లు, ఎంప్లారుూస్ సెల్ మద్దతు ప్రకటించింది. ఆదివారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మాహుతికి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డికి నివాళులు అర్పించినట్లు చెప్పారు. పాఠశాలలకు ప్రకటించిన సెలవులను రద్దు చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఆర్టీసీ రద్దు వల్ల జరిగే నష్టాలను, ప్రభుత్వ మొండివైఖరిని తెలియజేస్తామన్నారు. 48వేల టీచర్ల పట్ల రాష్ట్రప్రభుత్వం అమానుషంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈనెల 19న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్, సీనియర్ నేతలు డాక్టర్ కాశం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీ్ధర్ రెడ్డి, మాజీ మంత్రులు ఈ పెద్దిరెడ్డి, డాక్టర్ విజయరామారావు, రవీంద్రనాయక్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు మద్దతు ప్రకటించారు.

*చిత్రం...హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ అపోలో ఆసుపత్రి వద్ద ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ తదితరులు