తెలంగాణ

డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్, అక్టోబర్ 13: ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం కేసీఆర్ వైఖరితో మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కంచన్‌బాగ్ అపోలో ఆసుపత్రిలో ఆదివారం ఉదయం మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో అపోలో ఆసుపత్రి ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాసరెడ్డి అమర్‌హై అంటూ కార్మికుల నినాదాలతో ఆసుపత్రి ఆవరణ దద్దరిల్లింది. ఆసుపత్రికి చేరుకున్న జేఏసీ నేతలు ధర్నాకు దిగారు. కార్మికులను చెదరగొట్టడానికి పోలీసు బలగాలను రప్పించారు. పోలీసులు, జేఏసీ నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలను అరెస్టు చేశారు. వీరిని మైలార్‌దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీనివాసరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేసే వరకు జేఏసీ నేతలను పోలీసు స్టేషన్‌లోనే దాదాపు ఏడు గంటలపాటు ఉంచారు. శ్రీనివాసరెడ్డి ఆత్మ శాంతించాలని పోలీస్ స్టేషన్‌లోనే కార్మికులు వౌనం పాటించారు కాగా, డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి వార్త తెలుసుకున్న అన్ని రాజకీయ పార్టీ నేతలు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్యేనని ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పార్టీ నేతలు ముక్తకంఠంతో నినదించారు. శ్రీనివాసరెడ్డి మృతిపై ప్రభుత్వం మూల్యం
చెల్లించుకోవాల్సి వస్తుందని జేఏసీ నేతలు మండిపడ్డారు. తమ ప్రాణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని జేఏసీ నేతలు కనె్నర్ర చేశారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు హనుమంత రావు, సీపీఐ నాయకులు నారాయణ, శంకర్ నాయక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ వివేక్, మోత్కుపల్లి నర్సింహులు, జన సమితి నేత ప్రొ.కోదండరాం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ, ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వథామరెడ్డి తరలివచ్చి శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళి అర్పించారు. శ్రీనివాస రెడ్డి మృతి ప్రభుత్వం చేసిన హత్య అని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై 306 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేసారు. ఈనెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్ సకల జనుల సమ్మెను తలపించాలని వారు ప్రజలను కోరారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని వారు పేర్కొన్నారు. కార్మికులు ఎవరూ సంయమనం కోల్పోవద్దని, ఆత్మహత్యా యత్నాలకు పాల్పడవద్దని జేఏసీ నేత ముదిరాజ్ హనుమంత్ విజ్ఞప్తి చేశారు.
*చిత్రం...హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ అపోలో ఆసుపత్రి వద్ద ధర్నాలో పాల్గొన్న జేఏసీ నేతలు