ఆంధ్రప్రదేశ్‌

నిధి మాట ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూలై 13: రాష్ట్రంలో రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా రూ.5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నాడు తాను మూడువేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానంటే, చంద్రబాబు ఐదువేల కోట్లతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ధరల స్థిరీకరణ నిధి మాటెత్తడంలేదని ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం నిర్వహించిన రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వరి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, బ్యారన్‌కు ఏడు నుండి ఎనిమిది లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు నాలుగు లక్షల వరకు నష్టం వచ్చే రీతిలో పొగాకు ధరలు ఉన్నాయన్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో రైతులు 45 మిలియన్ కిలోలు పండిస్తే ఇప్పటి వరకు కేవలం 22 మిలియన్ కిలోలే కొనుగోలు చేశారని, వర్షాకాలం వచ్చేసినా నేటికీ కొనుగోళ్ళు పూర్తికానందున రైతుల వద్ద మిగిలిన పొగాకు రంగు మారిపోయి, నాసిరకం ధర మాత్రమే వస్తుందన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పొగాకు సరాసరి ధర కిలోకు రూ.165 వస్తే ఇప్పుడు కేవలం రూ.114 మాత్రమే వచ్చిందన్నారు. నాడు పామాయిల్ పండల ధర టన్ను పదివేలు ఉంటే నేడు రూ.7,400కు పడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు ఇప్పించడానికి కేంద్రంపై వత్తిడి తేవాలని డిమాండ్‌చేశారు.
chitram....
జంగారెడ్డి గూడెంలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకుంటున్న జగన్