తెలంగాణ

ప్రజలను మోసగించడంలో కేసీఆర్ పట్ట్భద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 13: రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన నయవంచకంగా కొనసాగిస్తున్నారని, ప్రజలను మోసగించడంలో కేసీఆర్ పట్ట్భద్రుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. దేశంలో మత ఛాందసవాదన పెంచుతూ బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతోందని మండిపడ్డారు.
కార్మికుల హక్కులను, చట్టాల సవరణలను హరిస్తూ అన్ని ప్రభుత్వ పరిశ్రమల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమన్నారు. విదేశీ పెట్టుబడులతో దేశంలో ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వడమన్నారు. దేశ సంపదను కేవలం కొద్దిమంది చేతుల్లోకి పెట్టడం దుర్మార్గమన్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ సమస్యలు పట్టించుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుని ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంత పాలనకు మార్క్స్ రాజకీయం అర్థమవుతుందని, నీచమైన పదజాలంతో మాట్లాడటం సరికాదన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో తమ మద్దతుపై పునరాలోచన చేస్తామన్నారు. కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించడం పట్ల ఉప ఎన్నికల్లో కలసి పనిచేయడంపై రేపు ముగ్దుం భవన్ హైదరాబాద్‌లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 16న అన్ని జిల్లాకేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహిస్తామని రాస్తారోకోలో జిల్లాలోని ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మేకల దాసు, రవీందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.