తెలంగాణ

ఆర్టీసీ కేసీఆర్ జాగీర్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 13: ఆర్టీసీ సంస్థ కేసీఆర్ జాగీర్ కాదని, మన ఓట్లకు పుట్టినోడు మనల్నే మనుషులం కాదంటే ఊరుకుంటామా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ నిప్పులు చెరిగాడు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఏకశిల పార్కులో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు వారి న్యాయమైన హక్కుల కోసమే సమ్మె చేస్తున్నారని, కేసీఆర్ ఆస్తులు ఏమైనా కార్మికులు అడిగారా? అంటూ ప్రశ్నించారు. ఉద్యమంలో లేనోళ్లంతా మంత్రులై కేసీఆర్ భజనపరులుగా మారారని అన్నారు. తెలంగాణ భూములను సినిమా హాళ్లకు, పెట్టుబడి దారులకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నాగం పన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నడిచినోళ్లను మరచి, ఉద్యమానికి దూరంగా ఉన్నవాళ్లందరినీ దగ్గరికి తీశాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో లేనోళ్లందరూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం వేసిన కుర్చీల మీద కూర్చుని మంత్రులగా చెలామణి అవుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులు జీతాల కోసం సమ్మె చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్టీసీ లాభాలతో నడిచే సంస్థ కాదని , దీనిని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారాల వల్లే ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఆర్టీసీ సమ్మెను తమ సమస్యగా భావిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తే ఆర్టీసీకి అప్పులెక్కడివి? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు మానాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో ఆర్టీసీని బాగుచేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ హామీని ఎందుకు మరిచారని అన్నారు. ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్ ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాలొన్నాడా? అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు మేఘా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వర్‌రావు లాంటి వారు దగ్గరయ్యారని, తెలంగాణ ప్రజలు దూరమయ్యారని అన్నారు. ఆర్టీసీకి వచ్చిన అవార్డులను కేసీఆర్ ఏమైనా కొనుక్కొని ఇచ్చాడా అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని, అప్పటి దాకా సహనంగా ఉండాలని ఆయన కోరారు. అంతకు ముందు దీక్షా శిబిరాన్ని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, బీజేపి, సీపీఐ, సీపీఎం, పార్టీల నాయకులు సందర్శించి దీక్షకు సంఘీభావం పలికారు.

*చిత్రం... ఆర్టీసీ దీక్షా సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్