తెలంగాణ

అసమర్ధ పాలనకు నిదర్శనం కేసీఆర్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఠంపల్లి, అక్టోబర్ 13: తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు కేసీఆర్ పాలనతో విసుగెత్తిపోయారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లాలోని బక్కమంతలగూడెం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం, ప్రశ్నించే గొంతును నొక్కివేయడం, అధికార దురహంకారం తప్ప అభివృద్ధి జాడ లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. కనీసం ఆరీసీ సమ్మెను పరిష్కరించ లేని అసమర్థ పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వంలోని మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని త్వరలో ప్రభుత్వంనిజస్వరూపం బయటపడుతుందన్నారు. టీఆర్‌ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోను ఎప్పుడో మర్చిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశామన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఇదే నియోజకవర్గం నుండే తాము మళ్ల్లీ గెలిచి కేసీఆర్ కళ్లు తెరిపిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పద్మావతి గెలుపు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు, మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీ రాజయ్య అన్నారు. ఆదివారం పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం చౌటపల్లి, అవిరేనికుంట తండాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇందిరమ్మ పాలనలోనే ప్రజలు సుఖంగా ఉన్నారని తెలంగాణ కోసం పొరాడి తీసుకువచ్చిన కాంగ్రెస్‌ను కాదని టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి ప్రజలు పలు సమస్యలతో బాధపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాయమాటలతో వంచిస్తోందన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని దీనికి నిదర్శనం తమ ప్రచారానికి తరలివస్తున్న జనమేనన్నారు. ఉత్తమ్‌పద్మావతి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
*చిత్రం... బక్కమంతలగూడెంలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉత్తమ్