తెలంగాణ

ఆర్టీసీ సమ్మెతోనే కేసీఆర్ పతనం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, అక్టోబర్ 13 : రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెతోనే సీఎం కేసీఆర్ రాజకీయ పతనం ప్రారంభమైందని, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమని మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ఆదివారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను నక్సలైట్లుగా ప్రచారం చేస్తున్నారని వారు లేకుంటే సకల జనుల సమ్మె విజయవంతం కాకపోయేదని అన్నారు. సీఎం మొండి వైఖరి మాని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సమ్మెకు అన్ని పార్టీలు, యూనియన్‌లు మద్దతు ఇచ్చాయని అన్నారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని వారి పిల్లలు దేశం కోసం పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదని హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భారీ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. పద్మావతి గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చుని ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుందని, సైదిరెడ్డి గెలిస్తే 100 మందిలో ఒకరని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధ విమానాలు నడిపి దేశ సరిహద్దులలో పనిచేశారని వారిది త్యాగ కుటుంబమని అన్నారు. సైదిరెడ్డి ఓడిపోతే మరలా విదేశాలకు వెళతారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా రైతు బంధు నగదు రైతుల ఖాతాలో వేయలేదని ఓట్ల కోసం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మాత్రం రాత్రికి రాత్రి వేశారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ముశం సత్యనారాయణ, ఎస్ సుబ్బరాజు, బొడ్డు గోవిందరావు, మాణిక్యమ్మ, ఎండీ ఖలీల్ పాల్గొన్నారు.
*చిత్రం... హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వీ. హనుమంతరావు