తెలంగాణ

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 13: ఎయిర్ ఇండియా, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రైవేటీ కరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే ప్రశ్నించని ప్రతిపక్షాలు ఆర్టీసీ సమ్మెలో దూరి కార్మికులను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యతనిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 26 డిమాండ్ల పరిష్కరించాలని సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులు ఆ ఊసే మరచి ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబట్టడం, అగ్నికి ఆజ్యం పోసినట్టు బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు టెంట్లు కనిపిస్తే అందులో దూరి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకోవడం ప్రజలు గమనించాలన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా చెప్పారా?అలాగే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారా? బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీనీ ప్రభుత్వంలో ఎక్కడైనా విలీనం చేశారా? అని ప్రశ్నించారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మెకు దిగితే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇచ్చే దిశగా సలహాలు, సూచనలను అందించాల్సిన ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతరానికే ప్రయత్నిస్తున్నారన్నారు. కార్మికులను రెచ్చగొడితే సమ్మెను ఉధృతం చేస్తే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. సమ్మెను రాజకీయానికి వాడుకోవడం సరికాదని, ఆర్టీసీ కార్మికులు గమనించాలని, ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని చెప్పలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు.
గతంలో కంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కుట్రకు తెరతీస్తుందని ఆరోపణలు చేస్తున్న కేంద్రం ఎయిర్ ఇండియాను, రైల్వేను, బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రకు తెరతీస్తుంటే దీనిని విపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఆర్టీసీ సంసన్థు పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాల నాయకులు స్వలాభాల కోసం సమ్మెను వాడుకుంటూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుకోవడం సబబా? అని ప్రశ్నించారు. 44 శాతం పిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఆర్టీసీ కార్మికులు పునరాలోచించి కుంచిత బుద్ధితో సీఎంపై అక్కసు వెళ్లగక్కుతూ రెచ్చగొట్టే విధానాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీసీ సమ్మెలో ఉరుముల లాగా చొరబడి ప్రభుత్వంపై విమర్శలే పనిగా పెట్టుకున్న విపక్షాల తీరును కార్మికులు గమనించాలన్నారు. గతంలో కంటే రవాణా వ్యవస్థ మెరుగు పడిందని, ప్రజలు సంతోషంగా ఉండడం విపక్షాలకు మింగుడు పడడం లేదని అన్నారు. ఏ ఆధారం లేకే ఆర్టీసీ కార్మిక సమ్మె చేస్తున్న కార్మికులను పట్టుకొని కనుమరుగైన వారు ఉనికి చాటుకునేందుకే ఉద్యమాలకు ఊతం ఇస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.
ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్