తెలంగాణ

ఉత్తమ్ జిమ్మిక్కులు ఈసారి పనిచేయవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, అక్టోబర్ 14 : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గ్రహించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ ప్రసంగిచనున్న సభావేదిక, మైదానం, హెలిపాడ్‌లను సోమవారం రాత్రి పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత రెండు సార్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆయన చేసిన జిమ్మిక్కులకు మోసపు మాటలు నమ్మి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించారని ఈసారి ఆయన ప్రజలను నమ్మించటానికి ఏమీ లేవని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని గ్రహించి ఈసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. సైదిరెడ్డి ఏ గ్రామం వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, స్వాగత నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. సీఎం సభకు ప్రజలను తరలించమని, వారే స్వచ్ఛందంగా తరలి వస్తారని ఆయన ఉపన్యాసం వినాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. అంతకు ముందు సభా వేదిక వద్ద, మైదానంలో, బారికేడ్ల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనవసర బారికేడ్లు ఏర్పాటు చేయవద్దని ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని ఏర్పాట్లు చేసే వారికి మంత్రి సూచించారు. ఆయన వెంట గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
*చిత్రం... రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి