తెలంగాణ

మూసీ గేటు నిర్మాణ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, అక్టోబర్ 14: నల్లగొండ జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ అయిన మూసీ ప్రాజెక్ట్ విరిగిన గేటు స్థానంలో నూతన గేటు నిర్మాణ పనులు సోమవారం నాటికి పూర్తి అయ్యాయి. ఈనెల 5వ తారీఖున ప్రాజెక్ట్ 5వ నెంబర్ రెగ్యులేటరీ గేటు విరగడంతో ప్రాజెక్ట్‌నుండి నీరు వృథాగా దిగువకు పోయింది. వెంటనే అధికారులు నూతన గేటు నిర్మాణం కోసం పనులు ప్రారంభించి సోమవారం ఉదయం నాటికి నూతన గేటు నిర్మాణం పూర్తిచేసి నీటివృథాను ఎట్టకేలకు అరికట్టగలిగారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాగా ఆదివారం నాటికి 617 అడుగులకు చేరుకుంది.
ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుండి గత రెండు రోజులుగా విస్తారమైన వర్షాలు కురవడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకోవడం వలన ప్రాజెక్ట్ నీటి మట్టం 623 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువలకు సోమవారం నుండి నీటి విడుదల నిలిపి వేసినట్టు ప్రాజెక్ట్ ఏఇ మమత తెలిపారు.

*చిత్రాలు..623 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం,
*గేటు నిర్మాణ పనులు పూర్తికావడంతో ఆగిన నీటి వృథా