తెలంగాణ

రణరంగంలా మారిన ఆర్టీసీ కార్మికుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 14: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సోమవారం చేపట్టిన సమ్మెలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ. ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా కొత్త బస్టాండ్‌కు చేరుకుని కార్మికులు డిపోలోకి వెళ్లేందుకు యత్నించడంతో కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొత్త బస్టాండ్ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ తోపులాటలో నలుగురు కార్మికులు సీహెచ్‌ఆర్‌సీ రెడ్డి, చంద్రం, సుదర్శన్‌లకు గాయలు కాగా, ఇందులో పురుషోత్తమ్‌కు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రి తరలించి చికిత్స చేశారు. కార్మికులు లోపలికి రాకుండా పోలీసు బలగాలు బారికేడ్లతో అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోడంతో కార్మికులు వాటిని తొలగించి లోపలికి వెళ్లారు. ఈక్రమంలో ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో పరిస్థితి అదుపుతప్పుకుండా అవసరమైతే పోలీసులు బాష్పవాయువును ప్రయోగించేందుకు మందు గుండు సామగ్రి అందుబాటులో పెట్టుకున్నారు. కొంతమందిని పోలీసులు డీసీఎం వ్యానులో ఎక్కించగానే పరిస్థితి మరింత ఉద్ధ్రికత్తంగా మారింది. దీంతో మహిళా కార్మికులు డీసీఎం వ్యాను ముందు బైఠాయించి మమ్మలి అందరినీ అరెస్టు చేయండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసు అధికారులు డీసీఎం వ్యానులోకి ఎక్కించిన వారిని దింపివేయడంతో కార్మికులు శాంతించారు.
*చిత్రాలు.. కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లతో కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు
* తోపులాటలో గాయపడ్డ ఆర్టీసీ కార్మికున్ని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం