తెలంగాణ

ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం చూపజాలవని, ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడడం తనకు ఎంతో బాధ కలిగించాయని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని
ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం కేశవరావు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వానికి కూడా కేశవరావు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించిందన్నారు. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల స్పష్టం చేయడం పట్ల అభినందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో సీఎం చేసిన ప్రకటన ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా చూడాలని కార్మికులకు కేకే సూచించారు. శాసనసభ ఎన్నికల (2018) మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నానని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదన అనేది ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదని కేకే స్పష్టం చేశారు. ఆర్టీసీ కాదు, ఏ ప్రభుత్వరంగ సంస్థనూ ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనలేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమే అవుతుందన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని కేకే స్పష్టం చేశారు.
ఇలా ఉండగా కేశవరావు చేసిన వినతికి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తాము కేశవరావుతో కలిసి పనిచేశామని, తమ సమస్యలు కూడా ఆయనకు తెలుసునని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వంతో చర్చలకు కేకే మధ్యవర్తిత్వం తమకు సమ్మతమేనని ఆయన స్పష్టం చేశారు.