తెలంగాణ

ఉద్యమ టీచర్లపై నిఘా.. తొలగింపునకు షోకాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు పలుకుతూ, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటున్న టీచర్ల, లెక్చరర్ల డాటాను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ జిల్లాల్లో వీడియో ఫుటేజీని ఆయా జిల్లాల డీఈఒలు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులు, ఆర్‌జేడీలు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు బహిరంగంగా నిరసన ప్రకటనలు చేస్తూ, ప్రత్యేక్ష కార్యాచరణలో పాల్గొంటున్నారు. జిల్లాల వారీ అటువంటి టీచర్ల డాటాను ఏరోజుకారోజు సేకరిస్తున్నారు. ఇంతవరకూ దాదాపు 107 మంది టీచర్లను గుర్తించినట్టు సమాచారం.