తెలంగాణ

ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరించడం సహించరానిదని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మూడవ దఫా పోరుబాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పిలుపుమేరకు హెచ్‌యూజే ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు వివిధ రాజాకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ సర్కారు నియంతృత్వ పోకడలను అవలంబిస్తూ, ప్రశ్నించే గొంతునొక్కేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగాలను, చివరికి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన జర్నలిస్టులకు ఎన్నో సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు, ఐజేయూ సీనియర్ నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రతినిధులతో కలిసి విరాహత్ అలీ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్‌కు వినతి పత్రం అందజేశారు.
*చిత్రం... హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న జర్నలిస్టుల సంఘాల నేతలు