తెలంగాణ

నిరసన హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాన్ని సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోమవారం బస్ డిపోల వద్ద బైఠాయింపు కార్యక్రమాల్లో కార్మిక కుటుంబాలు కన్నీరు పెట్టారు. శనివారం ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి ఆత్మార్పణం, ఆదివారం హైదరాబాద్‌లో కండక్టర్ సురేందర్ గౌడ్, నర్సంపేటలో డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నిండం వంటి ఘటనలు కార్మికుల భయాందోళనలు వెంటాడుతున్నాయి. సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందోనని ఆయా కుటుంబాలు ఆందోళన చెందాయి. కండక్టర్ సురేందర్ గౌడ్ పాడెను జేఏసీ నేతలు మోశారు. సురేందర్ మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత ఉస్మానియా ఆసుపత్రి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సురేందర్‌కు నివాళులర్పించారు. సీఎం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యావత్తు ఆర్టీసీ కార్మికులు కోపాద్రిక్తులయ్యారు. సోమవారం రాష్టవ్య్రాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు వీధుల్లోకి వచ్చారు. కార్మికుల బలిదానాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదారాబాద్‌లోని అన్ని బస్ డిపోల వద్దకు భారీగా కార్మిక కుటుంబాలు తరలిరావడంతో ఆయా డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బస్ డిలోల ముందు కార్మికుల నిరసనల హోరుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. డిపోల వద్ద బైఠాయింపులతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. తమ కుటుంబాలకు సీఎం అన్యాయం చేస్తున్నారని వారు బోరుమని ఏడ్చారు. తమ కుటుంబాలను పోషించే వ్యక్తి లేకపోతే తాము ఏమైపోతామని వారు కన్నీరు పెట్టుకున్నారు. కార్మికుల ఆర్తనాదాలపై బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం చలించిపోయారు. కార్మికుల కుటుంబాలకు తోడు విద్యార్థల మద్దతు పలకడంతో బైటాయింపుల్లో రచ్చరచ్చగా మారాయి. బస్ డిపోల వద్ద జరుగుతున్న బైఠాయింపులపై ఎప్పటికప్పుడు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారాన్ని స్థానిక పోలీసులు చేరవేశారు. దీంతో జంటనగరాల్లో ఉన్న బస్ డిపోల వద్దకు హుటాహుటిన బందోబస్తు బలగాలు చేరుకున్నాయి.
మంత్రుల బంగ్లాల వద్ద హై అలర్ట్
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మంత్రుల బంగ్లాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఎటువైపు నుంచి అయినా కార్మికులు చొరబడతారన్న సమాచారంతో బంగ్లాల వద్ద 30-50 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియా జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థలు భారీగా మంత్రుల బంగ్లాల వద్దకు చేరుకున్నారు. లోపలికి పోవడానికి విద్యార్థులు దూకుడుగా వెళ్ళారు. గేటు వద్దనే విద్యార్థలను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి పోవాలని విద్యార్థులు, లేదు వెళ్లకూడదని పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కార్మికులకు మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు బైఠాయింపు జరిగింది. విద్యార్థులను బలవంతంగా అక్కడ నుంచి వాహనాల్లో తరలించారు.
బస్ బస్సు భవన్ వద్ద
బైఠాయించిన విద్యార్థులు
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులకు మద్దతుగా విద్యార్థలు బస్ భవన్ వద్ద బైఠాయించారు. వందలాది విద్యార్థలు రావడంతో పోలీసులు సైతం ఊహించలేదు. బస్ భవన్ లోపలికి పోవడానికి విద్యార్థలు ప్రయత్నించారు. అయితే గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. తక్షణం కార్మికుల బలవన్మరణాలను సీఎం ఆపాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే మాబతుకులు ఏమైతాయని వారు నిలదీశారు. మరోపక్క కార్మికుల కుటుంబాలకు ప్రజా సంఘాల మద్దతు పలికాయి. వివిధ కార్మిక ట్రేడ్ యూనియన్లు కార్మికుల మద్దతుగా ర్యాలీలు చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూచినా రహదార్లపైకి కార్మిక కుటుంబాలు తరలిరావడం జరిగింది. దీంతో రహదార్లలో కార్మికుల నిరసనలతో హోరెత్తాయి.

*చిత్రాలు..*కండక్టర్ సురేందర్ మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న బీజేపీ నేత లక్ష్మణ్
*బోడుప్పల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి
*బస్సు భవన్ వద్ద ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసులు