తెలంగాణ

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్/ములుగు, జనవరి 3: రైతుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ సర్కార్ కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా ములుగు సమీపంలో ఈ నెల 7న ఉద్యానవన యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన సందర్భంగా ఆయన మట్లాడారు. ఉద్యానవన యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమానికి సిఎం కెసిఆర్‌తో పాటు కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్ హాజరు కానున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐదువేల మంది రైతులకు ఉద్యానవన పంటల సాగుపై అవగాహన, శిక్షణ ఇచ్చే కార్యక్రమమం చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అన్నదాతల ఆత్మహత్యల నివారణకు సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటుండగా రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. కాగా రూ.1000 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తుండగా తద్వారా విద్యుత్, నీటి వృథాను అరికట్టి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. వంటిమామిడి, బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లలో కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి చొరవ తీసుకుంటుండగా రైతులు పండించిన పంటలు నిలువ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ప్రతి రైతుకు రూ.లక్ష విలువ చేసే 20 గొర్రెలు, ఒక పొట్టేలు మంజూరు చేసే కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండగా, ప్రభుత్వ పథకాలను రైతులతో పాటు అన్ని వర్గాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అభివృద్ధి అథారిటీ అధికారి హన్మంతరావు, వివిధ శాఖల అధికారులు హుక్యానాయక్, రామలక్ష్మీ, శ్రావణ్‌కుమార్, నిర్మలా పాల్గొన్నారు.