తెలంగాణ

వెంటనే చర్చలు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, అక్టోబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో గత 14 రోజులుగా చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నదని మరణించిన డ్రైవర్, కండక్టర్ కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా అన్నారు. శుక్రవారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలను సీఎం కేసీఆర్ పాటించి వెంటనే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు చేయాలని అన్నారు. ఒకేసారి 50 వేల మంది కార్మికులను ప్రపంచంలో ఎక్కడా తొలగించలేదని, తాను అంతర్జాయ కార్మిక సంఘ నేతగా గత 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని అన్నారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం 2లక్షల మంది ఉద్యోగులను తొలగించినా వెంటనే తన తప్పు సవరించుకుందని కుంతియా గుర్తు చేశారు. శనివారం జరుగనున్న రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నారని నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
పద్మావతి భారీ మెజార్టీతో గెలస్తారు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నగదు, మధ్యం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలను దించి పంచుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశామని సీఆర్‌పీఎప్ బలగాలు ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వమని రైతులు, యువకులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎంపీగా గెలిచారని కాంగ్రెస్‌కు కంచుకోట వంటి నియోజకవర్గమని కాంగ్రెస్ నాయకులు అంతా ఐక్యమై ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుకుండా టీడీపీ, సీపీఐ, సీపీఎంలు పునరాలోచన చేసి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని అందరి లక్ష్యం తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటమేనని అన్నారు. ఉప ఎన్నిక తెలంగాణాలో చారిత్రాత్మకం కావాలని నిరంకుశ వైఖరి వల్లే ఇద్దరు కార్మికులు మరణించారని రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికని పెద్ద మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శులు బోస్‌రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్, శైలజానాధ్, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.