తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర బంద్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ వ్యాప్తంగా శనివారం ఉద్రిక్తత, నిరసనలు, అరెస్టుల మధ్య బంద్ సక్సెస్ అయ్యింది. హైదరాబాద్ జంటనగరాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, రాజకీయ అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొనడంతో ఉద్రిక్తత, అరెస్టులు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బంద్‌ను విజయవంతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు వేలాదిమంది నగర వీధుల్లోకి కదలివచ్చారు. మూకుమ్మడిగా ప్రభుత్వం, ప్రభుత్వేతర ఉద్యోగ, సిబ్బంది తరలివచ్చి బంద్‌లో పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్‌లో ఆందోళన కారుల నినాదాల
హోరుతో రహదారులు దద్దరిల్లాయి. ఒకవైపు పోలీసులు మరోవైపు ఆందోళనకారుల మధ్య ఘర్షణ వైఖరి, వాగ్వాదాలు నెలకొన్నాయి. బంద్ చేస్తున్న కార్మికులు, నేతలను బలవంతంగా పోలీసులు వాహనాల్లోకి కుక్కారు. దీంతో పలువురు ఆందోళనకారులకు స్వల్పగాయాలు తగిలాయి. బంద్‌లో పాల్గొన్న మహిళలపై పోలీసులు దరుసుగా వ్యవహరించడంతో వాగ్వాదాలు జరిగాయి. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనను విడిచిపెట్టారు. మరో జేఏసీ నేత రాజిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రాజకీయ పార్టీల నేతలను శనివారం ఉదయం నుంచే పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించడంతో ఆయా పార్టీల నేతలను నిర్బంధించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా పార్టీ నేతలను ముఖ్దు భవన్‌లోనే నిర్బంధించారు. నేతల అరెస్టులను అడ్డుకున్న పార్టీ కేడర్‌ను అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా బస్ భవన్‌ను ముట్టడించడానికి వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఆ పార్టీ కేడర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటలకు వరకు సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బలవంతంగా తమ్మినేనితో పాటు పార్టీ నేతలను పోలీస్ వాహనాల్లోకి బలవంతంగా తోసేశారు. పీవోడబ్ల్యూ మహిళా నేత కామ్రేడ్ విమలక్క, చెరుకు సుధాకర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అరెస్టు చేశారు. ఆమెను బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. సీపీఎం ఎంఎల్ నేత పోటు రంగారావును బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించే సమయంలో నినాదాలు చేస్తున్న రంగారావు చేయి డోర్ మధ్యలో ఇర్కుపోవడంతో బొటనవేలు విరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అబిడ్స్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు వందలాది మంది బీజేపీ కేడర్‌ను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను సైతం అరెస్టు చేశారు. ఆర్టీసీ జేఏసీ-1 కన్వీనర్ ముదిరాజ్ హనుమంత్‌ను గౌలిగూడ బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. బంద్‌లో పాల్గొన్న వేలాదిమందిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
*చిత్రాలు.. *బంద్‌తో జూబ్లీ బస్‌స్టాండ్‌కే పరిమితమైన బస్సులు
*సమ్మెతో బోసిపోయన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ (ఇన్‌సెట్‌లో)