తెలంగాణ

ఉద్యమాలను అణచివేస్తే ప్రజలే తిరగబడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని నాడు నిరంకుశ నిజాం గస్తీ నిషాన్ పేరుతో అణచివేయాలని చూస్తే ప్రజలు ఎలా తిరగబడ్డారో, అదే రీతిన నేటి నిరంకుశ కేసీఆర్‌పైనా తిరగబడతారని సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాష్టబ్రంద్‌లో భాగంగా శనివారం నాడు ఎంజీబీఎస్ వద్ద వందలాది మంది కార్యకర్తలతో వామపక్ష పార్టీల ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్ధంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ఏ మాత్రం గౌరవం లేకుండా, కార్మికుల ఆర్తనాదాలు అర్ధం చేసుకోకుండా , మతిభ్రమించి కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు చాలా వరకూ న్యాయమైనవేనని, వాటిని పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తూ మొండిపట్టుతో సమ్మె చెస్తున్న ఆర్టీసీ కార్మికులను తీసేశామని , వారితో చర్చలు లేవని, సమ్మెను అణచివేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ధర్నాలో నగర నేతలు ఆర్ శంకర్ నాయక్, కే చంద్రమోహదన్ గౌడ్, నెర్లకంటి శ్రీకాంత్, ఎస్‌ఏ మన్నన్, కమతం యాదగిరి, శక్తిబాయి, అనిల్‌కుమార్, జీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయిలు చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
శాసన ఉల్లంఘన: ఏఐటీయూసీ
న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాల ధిక్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడతే కార్మిక సంఘాలు శాసన ఉల్లంఘనకు పిలుపునివ్వాల్సి వస్తుందని ఎఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ పేర్కొన్నారు. నేటి బంద్‌తో కార్మికవర్గం, ప్రజానీకం, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అండగా ఉన్నారనేది అర్ధమైందని పేర్కొన్నారు. కార్మిక మంత్రి , రవాణా మంత్రి వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపి తమ సమర్ధతను చాటుకోవాలని కోరారు.
కార్మిక శాఖ కార్యాలయాల ముట్టడి
ఆర్టీసీ పరిరక్షణకు 50 వేల మంది కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సీఐటీయూ, ఎఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ, టీఎంఎస్‌ఆర్‌యూ నేతలు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. గత 15 రోజులుగా న్యాయమైన కోర్కెల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతుంటే రాష్ట్ర కార్మికశాఖ నిద్రమత్తులో జోగుతోందని విమర్శించారు.