తెలంగాణ

రాష్ట్రం తీరును కేంద్రం గమనిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటమే గాక, నయా నిజాంను తలపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ మండిపడ్డారు.
ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీజేపీ శనివారం నాడు ఆబిడ్స్ జీపీఓ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని ధర్నా నిర్వహించగా, పోలీసులు లక్ష్మణ్‌ను, ఎమ్మెల్సీ రామచందర్ రావు, పొంగులేటి సహా వందలాది కార్యకర్తలను అరెస్టు చేసి కొంత మందిని ఆబిడ్స్ స్టేషన్‌కు మరికొంత మందిని గోషామహల్ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై మంత్రులు వౌనం వహిస్తున్నారని, మంత్రి పదవులు శాశ్వతం కాదని, ప్రజాసమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నేతలు ముందుండాల్సింది పోయి, వౌనం పాటిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లను ప్రస్తావిస్తూ వీరైనా ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని అన్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలు ముఖ్యమా? పదవులు ముఖ్యమా అన్నది గుర్తెరగాలని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అప్రజాస్వామిక విషయాన్నీ కేంద్రానికి తెలుపుతున్నామని, కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదు, గవర్నర్ సీరియస్ అయినా కేసీఆర్‌కు చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. ఇది నియంతృత్వానికీ , ప్రజాస్వామ్యానికీ జరుగుతున్న పోరు అని అన్నారు. ప్రస్తుత సమ్మె ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదని, సకల జనుల సమ్మె అని చెప్పారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొనని వారంతా ద్రోహులని చెప్పిన టీఆర్‌ఎస్ నేతలు ఈనాడు ఎందుకు ఉద్యమంలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఇపుడు కార్మికుల ఉద్యమంలో పాల్గొనని మంత్రులు ఈటెల , హరీష్‌రావులు కూడా ద్రోహులేనా అని ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యేలకు ప్రజలు ముఖ్యమా? పదవులు ముఖ్యమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అతి ప్రజాస్వామిక విధానాలను కేంద్రం గమనిస్తోందని అన్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని పేర్కొన్నారు.
కేసీఆర్ మారాలి: ఇంద్రసేనారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మారాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఉద్యమం ముందు ఎన్నో మాటలు చెప్పిన, ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ విస్మరించారని అన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమండ్లను , ఆర్ధిక భారం లేని అంశాలను కూడా పరిష్కరించకుండా సాచివేత ధోరణి ప్రదర్శించడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి కార్మికుల ఆగ్రహానే్న కాదని, ప్రజల ఆగ్రహాన్ని కూడా చవిచూస్తున్నా ఆయనలో మార్పు రావడం లేదని, మంత్రివర్గంలోని మిగిలిన మంత్రులు సైతం కార్మికుల సమ్మెపై వౌనం పాటిస్తున్నారని ఇదేం విధానమని అన్నారు. పార్టీ నేతలు సుకుమార, రే వూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ సీఎం తీరును తప్పుపట్టారు.
పతనానికి నాంది: కృష్ణసాగరరావు
టీఆర్‌ఎస్ పతనానికి తాజా ఉద్యమం నాందీ ప్రస్తావన పలికిందని బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి కే కృష్ణ సాగరరావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానంలో అధికారంలో ఉన్న నేతలు మొండివైఖరి ప్రదర్శించడం సరికాదని అన్నారు.